![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -431 లో.... రాజ్ ఇచ్చిన వార్నింగ్ కు మాయ బయపడి బట్టలు సర్దుకుంటుంది. అప్పుడే రుద్రాణి రాహుల్ లు వస్తారు. వెళ్లిపోతున్నా అని మాయ అనగానే "నాకు తెలుసు.. చివరి నిమిషంలో ఇలా హ్యాండ్ ఇస్తావని నాకు తెలుసు.. నిన్ను ఎలా వెళ్ళనిస్తాం" అని రాహుల్ అంటాడు. నువ్వేం చేస్తావ్ .. ఏం చెయ్యలేవు ఎక్సట్రా మాట్లాడితే నన్ను తీసుకొని వచ్చి ఇదంతా చేస్తున్నారని చెప్తానని రాహుల్, రుద్రాణిలని మాయ బెదిరిస్తుంది.
మరొకవైపు రాజ్ నిద్రలేచి బయటకు వస్తాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఆ మాయ నేను ఇచ్చిన వార్నింగ్ కి భయపడి వెళ్ళిపోయి ఉంటుందని బయటకు వస్తాడు. తీరా చుస్తే మాయ తులసి చెట్టుకి పూజ చేస్తుంటుంది. తను ఇంకా వెళ్ళిపోలేదా.. నీ సంగతి చెప్తానంటూ రాజ్ వెళ్తుంటే అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. రాజ్ కి కావ్య గొప్పతనం గురించి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ మాయ దగ్గరికి వెళ్తాడు. త్వరగా లేచారు ఈ రోజు మన పెళ్లి కదా అని మాయ అంటుంది. అలా మాయ అనగానే నిన్ను వెళ్లి పొమ్మని చెప్పాను కదా అని రాజ్ అడుగుతాడు. వెళ్ళిపోదామనే అనుకున్న కానీ ఇంత ఆస్తిని వదిలిపెట్టి ఎలా వెళ్ళగలనని మాయ అంటుంది. నువ్వేం చెయ్యలేవని మాయ అంటుంది. మీ నాన్న సంగతి నేను చూస్తానని రాజ్ అనగానే.. మాయ వాళ్ల నాన్న కి ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నావని అడుగుతుంది. నువ్వే కదమ్మా రాత్రికి రాత్రి మలేషియా పంపించావని తన నాన్న చెప్తాడు. అదంతా స్పీకర్ పెట్టి రాజ్ కి వినిపిస్తుంది. నువ్వు ఇప్పుడేం చెయ్యలేవని మాయ అంటుంది. ఆ తర్వాత మాయ, రాజ్ లని అపర్ణ పిలిచి పెళ్లి బట్టలు ఇస్తుంది. మరొకవైపు ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా.. వాళ్లే నిర్ణయం తీసుకున్నారు.. వాళ్ళకి లేని బాధ మీకెందుకని అంటుంది.
కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. నేను ఎవరిని హెల్ప్ అడగలేదు. నిన్ను అడుగుతున్నాను. ఈ ప్రాబ్లమ్ నుండి బయట పడేయమని రాజ్ అనగానే.. మీరేం టెన్షన్ పడకండి నేను ఉన్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యకి అప్పు ఫోన్ చేసి డాక్టర్ మాట్లాడాలట నీతో అని చెప్తుంది. డాక్టర్ కావ్యతో మాట్లాడుతుంది. ఒక ఇంజక్షన్ వేస్తే స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పగానే.. ఆ పని చెయ్యండి ఆ మాయ స్పృహలోకి రావడం చాలా అవసరమని కావ్య అంటుంది. దానికి డాక్టర్ సరే అంటుంది. తరువాయి భాగంలో పెళ్లిపీటలపై మాయ, రాజ్ లు కూర్చొని ఉంటారు. ఆ తర్వాత అసలు మాయ స్పృహ లోకి వచ్చిందని అప్పు ఫోన్ చేయగానే కావ్య బయల్దేరి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |